22-03-2025 07:47:43 PM
పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, గుమ్మడిదల మండలాలలో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ నందకుమార్ శనివారం ఆకస్మికంగా పర్యటించారు. జిన్నారం మండలంలోని కొడకంచి, గుమ్మడిదలలో పర్యటించిన రైతులను కలిసి మాట్లాడారు. అనంతరం రైతులతో కలిసి పంట పొలాల వద్దకు వెళ్లారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు, విద్యత్ సిబ్బంది పనితీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు సిబ్బంది సకాలంలో స్పందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సిబ్బందికి ఆయన సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ దుర్గాప్రసాద్, బొంతపల్లి ఏఈ రవీందర్, గుమ్మడిదల, కొడకంచి గ్రామాల రైతులు వడ్డె క్రిష్ణ, అభిలాష్ గౌడ్, పాతూరి మల్లేశ్, శ్రీనివాస్ గౌడ్, కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.