calender_icon.png 22 January, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

21-01-2025 04:48:12 PM

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్...

వాంకిడి (విజయక్రాంతి): సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్ పిలుపునిచ్చారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలో ఎన్నికలతో కలిసి ఈనెల సంగారెడ్డి జిల్లాలో 25 నుండి 28 వరకు జరగనున్న మాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సమశీల పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో నిరంతరం పోరాటం చేయడం జరుగుతుందన్నారు. కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన సిపిఎం పార్టీ నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్తీక్, నిఖిల్, తిరుపతి, శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు.