21-02-2025 12:39:45 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ఈనెల 23న గాంధీభవన్‌లో జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌కు తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జి హోదాలో కొత్తగా నియమితులైన మీనాక్షి నటరాజన్ తొలిసారి హాజరుకానున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పీఏసీ, పీఈసీ సభ్యులు, పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన అభ్యర్థులు, పీసీసీ అధికార ప్రతినిధులకు కూడా గాంధీభవన్ నుంచి ఆహ్వానం వెళ్లింది.
ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత అంశాలు, రాష్ట్ర, జాతీయ రాజకీయ అంశాలపై చర్చిం చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయింది. ప్రభుత్వం అమలు చేస్తు న్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కూ డా చర్చించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రం లో ఒక టీచర్ ఎమ్మెల్సీ, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉంది. ఒక పట్టభద్రుల స్థానం నుంచే నరేందర్‌రెడ్డిని బరిలో దింపింది. సిట్టింగ్ స్థా నమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని గెలిపించుకోవాలని అధికార కాంగ్రెస్ పట్టుదలతో ఉంది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలను కైవ సం చేసుకొనే అంశంపై కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా కులగణ న, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అంశం పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో చర్చకు రానుంది.