01-03-2025 01:09:01 AM
7, 8 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
8న సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
9న ప్రధానిని కలిసే అవకాశం
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే అంశాలపై చర్చించేందుకు ఈ నెల 6వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వీటిని క్యాబినెట్‌లో ఆమోదించే అవకాశం ఉంది. ఆ తర్వా త 7,8 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి క్యాబినెట్‌లో ఆమోదించిన బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెడుతారని సమాచారం.
8వ తేదీన సాయంత్రం ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు. 10వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉభయసభల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో పెట్టి ఆమోదించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా ఇతర పార్టీల నాయకులను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు.