హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం జూలై 25వ తేదీన భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హల్ లో ఉదయం 9 గంటలకు మంత్రివర్గం సమావేశం కానున్నది. ఈనెల 25న రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించి బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.