20-03-2025 12:00:00 AM
ఓవైపు సంక్షేమం,మరోవైపు అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ ఉంది. బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ సంక్షేమానికి గతంలో ఎప్పుడూ లేనివిధంగా 70 వేల కోట్లను కేటాయించారు. విద్య, వైద్య శాఖకు కూడా పెద్ద ఎత్తున నిధులు, రైతాంగానికి సముచిత స్థానం కల్పించారు.
ప్రతిపక్షాలకు విమర్శించడానికి అవకాశం లేకుండా బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయి. వివిధ శాఖలకు కేటాయింపులను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయి. గతంలో బిఆర్‌ఎస్ కేటాయింపులకు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా పాలనలో కేటాయింపులకు, సంక్షేమానికి చాలా వ్యత్యాసం ఉంది.
సుడా ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి