calender_icon.png 8 October, 2024 | 10:12 AM

స్టేట్ బ్యాంక్ మూలం

01-09-2024 12:00:00 AM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలుత 1806 జూన్ 2న కలకత్తాలో (ఇప్పటి కోల్‌కతా) బ్యాంక్ ఆఫ్ కలకత్తాగా ఏర్పాట య్యింది. తదుపరి 1809లో దానిని బ్యాంక్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు. బ్రిటిష్ ఇండియా అధీనంలో తొలి జాయింట్‌స్టా క్ బ్యాంక్‌గా ఏర్పడింది. బ్రిటిష్ ఇండియా  ఇదేతరహాలో 1940లో బ్యాంక్ ఆఫ్ బొంబే, 1943లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌లను నెలకొల్పింది. ఈ మూడు బ్యాంక్ లూ 1921లో విలీనంకావడం ద్వారా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది.

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినపుడు ఇంపీరియల్ బ్యాంక్ మూలధనం రిజర్వులతో సహా రూ.11.85 కోట్లు. రూ.275.14 కోట్ల డిపాజిట్లు, రూ.72.94 కోట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 172 శాఖలు, 200కుపైగా సబ్ ఆఫీసులు నెలకొన్నా యి. అనంతరం  ప్రభుత్వ భాగస్వామ్యంతో ఒక బ్యాంక్‌ను ఏర్పాటుచేసేందు కు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలంటూ కమిటీ ఒకటి సిఫార్సుచేసింది.

దీంతో 1995 మే నెలలో పార్లమెంటులో ఎస్బీఐ చట్టాన్ని ఆమోదించడంతో 1955 జూలై 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నెలకొల్పారు. అందుకే జూలై 1వ తేదీని ఎస్బీఐ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1959లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సబ్సిడరీ బ్యాంక్‌లు) చట్టాన్ని ఆమోదించడం ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది బ్యాంక్‌లను ఎస్బీఐ టేకోవర్ చేసి, వాటిని తన సబ్సిడరీలుగా మార్చుకున్నది.  ముంబై ప్రధాన కేంద్రంగా దేశ, విదేశాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.