పాపన్నపేట: 68వ రాష్ట్ర స్థాయి ఎస్.జి. ఎఫ్. బాడ్మింటన్ పోటీలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. మెదక్ పట్టణంలోని PNR ఇండోర్ స్టేడియంలో అండర్ -14 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలు మంగళవారం రోజున ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి జిల్లాల వారీగా జరుగుతున్న ఈ పోటీలలో పాల్గొనేందుకు అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైనటువంటి మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరు ఆటలో నైపుణ్యాలను పెంచుకునేందుకుగాను కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రిఫరీలు మధు, శివశంకర్, కుర్షిద్, వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు, శ్రీనివాస్,వినోద్తో పాటు తదితరులు పాల్గొన్నారు.