నాగర్ కర్నూల్ జిల్లాలో ఇదే మొదటిసారి.
వివిధ జిల్లాల నుండి రానున్న 1,200 మంది క్రీడాకారులు
ఏర్పాటు పూర్తి చేసిన అసోసియేషన్ సభ్యులు
కల్వకుర్తి : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో 2024 డిసెంబర్ 22న ప్రారంభం కానున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఛాంపియన్ షిప్ 2024 అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీలు తొలిసారిగా కల్వకుర్తి పట్టణంలో నిర్వహించబోతున్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ సోల పోగుల స్వాములు, సభ్యుల సహకారంతో ఈ పోటీల ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ పరుగు పందాలు హైదరాబాద్ చౌరస్తా నుంచి మహబూబ్నగర్ చౌరస్తా సమీపానగల ఎంపీడీవో ఆఫీస్ వరకు క్రీడాకారులు పరిగెత్తనున్నారు. 22వ తేదీ ఉదయం 6 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పోటీలకు రానున్న అథ్లెట్లకు భోజన, వసతి కూడా ఏర్పాటు చేసినట్లు డాక్టర్ సోల స్వాములు తెలిపారు.
ఈ పోటీలు నాలుగు కేటగిరీలలో జరుగనున్నాయి
అండర్ 16 (2 కిలోమీటర్ల పరుగు)
అండర్ 18 ( బాయ్స్ 6 కిలోమీటర్ల గర్ల్స్ 4 కిలో మీటర్లు పరుగు)
అండర్ 20 (బాయ్స్ 8 కిలోమీటర్ల, గర్ల్స్ 6 కిలో మీటర్లు)
మెన్ అండ్ ఉమెన్ (10 కిలోమీటర్ల పరుగు)
ఈ పోటీలలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు పాల్గొననున్నారు, వీరంతా వారి ప్రతిభకు పదును పెట్టనున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన 32 మంది క్రీడాకారులు జాతీయస్థాయిలో పాల్గొన ఉన్నారు.
గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం కోసమే..
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఛాంపియన్ షిప్ 2024 క్రీడాకారుల మధ్య కొత్త మైలురాయిలను నమోదు చేస్తుందని, ఈ పోటీలు కల్వకుర్తి పట్టణంలో అథ్లెటిక్స్ రంగంలో మైలు రాయిగా నిలిచిపోనున్నాయి. నల్లమల్ల ప్రాంతంలో మొదటిసారిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో దాగివున్న క్రీడాకరుల నైపుణ్యాలను వెలికి తీయడం కోసమే ఈ పోటీలను ప్రారంభిస్తున్నాము. వివిధ జిల్లాల నుంచి రానున్న క్రీడాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశాం. అన్ని నిబంధనలను అనుసరించే పోటీలు జరుగనున్నాయి. స్టేట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మా మీద నమ్మకం ఉంచి ఈ ఆవకాశాన్ని మా జిల్లాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. - జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ సోలపోవుల స్వాములు.