calender_icon.png 16 January, 2025 | 12:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు గనిలో ఆకలి చావులు

16-01-2025 01:52:47 AM

* వంద మందికిపైగా మృతి

కేప్‌టౌన్, జనవరి 15: బంగారం తవ్వేందుకు గనుల్లోకి అక్రమంగా చొరబడి బయటకు రాలేక, ఆకలితో అలమటించి వంద మందికి పైగా మృతిచెందారు. దక్షిణాఫ్రికాలో ఈ ఘటన వెలుగు చూసింది. దేశంలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2023లో ‘ఆపరేషన్ క్లోజ్ ది హోల్’ పేరుతో అరెస్టులు ప్రారంభించింది.

అరెస్ట్‌కు భయపడిన వంద మందికిపైగా కార్మికులు 2.5 కి.మీ లోతులోని గనిలోనే ఉండిపోయారు. తర్వాత ప్రభుత్వం గని నుంచి బయటకు వచ్చే దారులను మూసివేసింది. దీంతో లోపల ఉన్న వారికి నీరు, ఆహారం అందలేదు. ఈ నేపథ్యంలో ‘మమ్మల్ని రక్షించండి’ అని గని నుంచి ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దీంతో గనిలో చిక్కుకున్న మరో వ్యక్తి కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ బృందం ఈ నెల 10న రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి ౩౫ మందిని కాపాడింది.