calender_icon.png 25 October, 2024 | 3:53 AM

విద్యార్థులతో స్టార్టప్‌లు

22-07-2024 02:11:22 AM

వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ఐటీ, పరిశ్రమల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసి, వారిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా, స్టార్టప్ నిర్వాహకులుగా తీర్చిదిద్దడమే ఫౌండర్స్ ల్యాబ్ సంస్థ ఉద్దేశమని ఐటీ, పరిశ్రమల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పేర్కొన్నారు. ఆదివారం టీహబ్ లో ఘనంగా ఫౌండర్స్ ల్యాబ్ సంస్థ మొదటి వార్షికోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన జయేష్ రంజన్ సంస్థ వార్షిక నివేదికను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీ దశ నుంచే ఎంట్రప్రెన్యూర్ షిప్ మీద అవగాహన కల్పిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం సైతం స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి టీ-హబ్ వంటి అనేక సంస్థలను ప్రారంభించిందని తెలిపారు. కార్యక్రమంలో ఈవై కార్పొరేట్ సంస్థ తెలంగాణ పార్టనర్ జయేష్ సంఘ్వీ, టీ- హబ్ సీఈవో శ్రీనివాసరావు, టీహబ్ సీఈవో కాసరగడ్డ శకుంతల తదితరులు పాల్గొన్నారు.