calender_icon.png 6 October, 2024 | 1:00 PM

ఐవీఐ ప్రోగ్రామ్‌తో స్టార్టప్ వ్యవస్థ బలోపేతం

05-10-2024 01:26:27 AM

కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి

హైదరాబాద్, అక్టోబర్ 4(విజయక్రాంతి): ఐ వెంచర్ ఇమ్మెర్సివ్(ఐవీఐ) ప్రోగ్రామ్ స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేస్తుందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఆకాంక్షించారు. శుక్రవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)లో ఆరు నెలల ఐవీఐ ప్రాగ్రామ్‌ను ఆయన ప్రారంభించారు. దీన్ని తొలిసారి ఐఎస్‌బీలో ప్రవేశపెట్టారు.

ఈ నేపథ్యంలో ఐవీఐ కోసం ఏర్పాటు చేసిన తరగతి గదిని కూడా కేంద్రమంత్రి ప్రారంభించారు. అనంతరం జయంత్ చౌదరి మాట్లాడుతూ.. ఈ ప్రోగ్రామ్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆలోచనలను వాస్తవ రూపంలోకి తెస్తుందన్నారు. కార్యక్రమంలో ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.