calender_icon.png 17 January, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరంభించే పథకాలు అద్భుతం

17-01-2025 02:04:04 AM

  • లోపాలు లేకుండా నిజమైన లబ్ధిదారులకు పథకాలను అందించాలి 
  • ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో గ్రామసభలు నిర్వహించాలి 
  • సంక్షేమ పథకాల అమలుపై ఉమ్మడి జిల్లా కార్య చరణ సమన్వయ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు

మహబూబ్ నగర్, జనవరి 16 (విజయ క్రాంతి) : నిజమైన లబ్ధిదారులకు ఆరంభించే నాలుగు పథకాలు పథకాలు అద్భుతమైన టువంటివని రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. గురువారం కలెక్టరేట్ లొని సమావేశ మందిరం నందు ఈనెల 26వ తేదీ నుంచి ఆరంభిస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్తరేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుపై మంత్రి జూపల్లి కష్ణారావు తో పాటు ఉమ్మడి జిల్లా అధికారులు ఎమ్మెల్యే లు ప్రజాప్రతినిధులతో కలిసి కార్యాచరణ సమన్వయ సమావేశంనికి హాజరై మాట్లాడా రు.

ఏ ఒక్క నిరుపేద పథకాల దూరంగా చూడవలసిన బాధ్యత అధికారుల, ప్రజాప్ర తినిధులపై ఉందని స్పష్టం చేశారు. గ్రామ సభలలో ఎమ్మెల్యేలు, ఇందిరమ్మ కమిటీల ను బాగాస్వాములను  చేయాలని సూచిం చారు. ప్రభుత్వ పథకాలపై ప్రచార లోపం సమన్వయం లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో జరిగే గ్రామ సభల్లో తాను, సహచర మంత్రి జూపల్లి కష్ణారావు  కూడా రెండు, మూడు గ్రామాల లో పాల్గొంటామని ఆయన తెలిపారు. 

ఐదు రోజుల కార్యక్రమ  సమాచారం నియో జకవర్గాల వారిగా ఎమ్మెల్యేలకు సమాచా రం ఇవ్వాలన్నారు. అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఉన్న వారికి పథకాల వర్తింపు పై క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో నాలు గైదు గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటే అవగాహన వస్తుందన్నారు.

గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు పాల్గొనడం ద్వారా క్షేత్రస్థాయి లో  సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి విన్నవించే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల వారిగా ఎంత మంది లబ్ధిదారులు, ఎన్ని నిధులు మంజూరు అయ్యాయో గణంకాలతో కూడిన సమాచారం ఎమ్మెల్యే లకు ఇస్తే  ఆయా గ్రామాల్లో వాళ్ళు పర్యటిం చిన సమయంలో ఆయా గ్రామాలకు ప్రభు త్వ సంక్షేమ పథకాలు, నిధులు ప్రభుత్వం ఎన్ని కేటాయించింది అనే అంశాలను ప్రజలకు చెప్పే ఆస్కారం ఉంటుందన్నారు.

లోపాలు లేకుండా అమలు చేయండి: మంత్రి జూపల్లి కష్ణారావు

నాలుగు పథకాల అమలు లోపాలు లేకుండా పకడ్బందీగా  లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని రాష్ర్ట ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు ఆదేశించారు. లబ్ది దారుల ఎంపిక కు క్షేత్ర పరిశీలన, గ్రామ సభలు, నిర్వహణ  అధికారులు, ప్రజా ప్రతి నిధులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన  నియమాల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగా లని, అర్హులు మిస్ కావొద్దన్నారు. ఆన్లైన్ లో టిక్ చేయకపోవడం వల్ల అర్హులు కాకుండా పోతున్నారని చెప్పారు. 

వ్యవసాయ యో గ్యం కానీ భూములను పంచాయతీ కార్యద ర్శులు క్షేత్రస్థాయిలో నిశితంగా సర్వే చేయా లని సూచించారు. గూగుల్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేయడం జరుగుతుందా అని మంత్రి ప్రశ్నించారు.  నిబంధనలకు విరు ద్ధంగా ఏమి చేయ వద్దని తెలిపారు. కొత్త పథకాల అమలులో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. వన పర్తి జిల్లాలోని చిన్నంబావి మండలం లోని ఓ గ్రామంలో రేషన్ కార్డుల ధరఖాస్తులలో వ్యత్యాసం వచ్చిందని చెప్పారు. 

నాలుగు పథకాలలో ఎక్కడా కూడా ల్యాప్స్ లేకుండా చూడాలని, గ్రామాల్లో సభలు పెట్టేముందు ప్రజా ప్రతినిధులకు సమాచా రం ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో ఒక రోజు ముందే టామ్ టామ్ వేయించి గ్రామ సభలు నిర్వహించాలని, గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీలను, మహిళా సంఘాలను  భాగస్వా ములు చేయాలని సూచించారు.

అంతకు ముందు రాష్ర్ట మైనార్టీ కార్పొరేషన్  చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్,  ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ప్రత్యేక అధికారి రవి, జిల్లా  శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, కూచుకుల్ల రాజేష్, మేఘా రెడ్డి, బండ్ల కష్ణమోహన్ రెడ్డి, విజయుడు, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డీసీసీబీ చైర్మన్  విష్ణు వర్ధన్‌రెడ్డితో కలిసి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల,రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాల అమ లుపై హలో అంశాలను సమావేశం దష్టికి తీసుకువచ్చారు. 

జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికా రులకు దిశా నిర్దేశం చేశారు. ఉమ్మడి  జిల్లా కలెక్టర్లు విజయేందిర బోయి, బదావత్ సంతోష్, ఆదర్ష్ సురభి, బి.ఎం. సంతోష్, ఆయా జిల్లాల ఆదనవు కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.