calender_icon.png 22 February, 2025 | 2:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టార్టప్‌ల అభివృద్ధి మరింత వేగంగా!

19-02-2025 01:15:11 AM

  1. బ్రెజిల్‌కు చెందిన గోయాస్ హబ్‌తో టీహబ్ కీలక ఎంవోయూ
  2. సీఎం రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబుతో గోయాస్ హబ్ ప్రతినిధుల చర్చలు 

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యానికి బ్రెజిల్‌కు చెందిన గోయాస్ హబ్‌తో టీహబ్ ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బా బు మంగళవారం హెఐసీసీలో గోయాస్ హబ్  ప్రతినిధులతో చర్చలు జరిపారు.

అనంతరం టీహబ్ ఫౌండే షన్ సీఈవో సుజిత్, బ్రెజిల్‌లోని గోయాస్ స్టేట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెక్రటరీ జోస్ ఫ్రెడెరికో లైరా నెట్టో ఎంవోయూపై  సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్‌లకు బ్రెజిల్‌లో అవకాశాలు, అలాగే బ్రెజిల్ స్టార్టప్‌లకు మన రాష్ర్టంలో అవ కాశాలు లభిస్తాయి.

ప్రధానంగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రి-టెక్, హెల్త్‌కేర్, బయోటెక్, మైనింగ్ రం గాల్లో పరస్పర సహకారం పంచుకుంటాయి. మార్కెట్ యాక్సెస్‌తో పాటు కెపాసిటీ బిల్డింగ్ ఇంక్యుబేషన్, సాంకేతిక భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాల మెరుగుదల వంటి అంశాలపై రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్ స్టార్టప్ ఎకో సిస్టమ్‌ల మధ్య సంబంధాలు బలపడే అవకాశం ఉంది.