- ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపన
- ట్రాఫిక్ వలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లపై పైలట్ ప్రాజెక్టు
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీకి భూమి పూజ
- 1 నుంచి 9వ వరకు ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ విడుదల
- శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొనున్న సీఎం, మంత్రులు
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజాపాలన విజయోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రభుత్వం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం 9వ తేదీ వరకు సీఎం, మంత్రులు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొననున్నారు.
వచ్చే నెల ఒకటో తేదీన సీఎం కప్‌తో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 8వ తేదీ వరకు ప్రతిరోజు జరిగిన కార్యక్రమాలపై సంబంధింత మంత్రులు మీడియాతో మాట్లాడనున్నారు. ఇదే సమయంలో తమ శాఖకు సంబంధించిన పురోగతిని మంత్రులు మీడియాకు వెల్లడించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 9వ తేదీన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ తర్వాత.. ట్యాంక్‌బండ్‌పై ముగింపు వేడుకలు జరగనున్నాయి. దీంతో విజయోత్సవాలు ముగియనున్నాయి.
తొమ్మిది రోజుల పాటు జరిగే కార్యక్రమాలు ఇవే..
డిసెంబర్ 1
* సీఎం కప్ పోటీలు (డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు)
* ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపన
* విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీలు
డిసెంబర్ 2
* 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం
* 213 కొత్త అంబులెన్సులు ప్రారంభం
* 33 ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ల ప్రారంభం
* ట్రాఫిక్ వలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లపై పైలట్ ప్రాజెక్టు
డిసెంబర్ 3
* హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు.
* ఆరాంఘర్ నుంచి జూ పార్క్ ఫ్లుఓవర్ ప్రారంభం.
* రూ. 150 కోట్లు విలువైన బ్యూటిఫికేషన్ పనుల ప్రారంభం
* కేబీఆర్ పార్క్ సమీపంలో 6 జంక్షన్ల అభివృద్ధి పనుల ప్రారంభం
డిసెంబర్ 4
* తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపన
* వర్చువల్ సఫారీ, వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం
* 9,007 మందికి నియామక పత్రాల పంపిణీ.
డిసెంబర్ 5
* ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం
* స్వయంసహాయక గ్రూపుల్లో చర్చలు
* 3 (మేడ్చల్, మల్లేపల్లి, నల్లగొండలో) ఏటీసీల ప్రారంభం
* ఘట్‌కేసర్‌లో బాలికల ఐటీఐ కాలేజీ ప్రారంభం
డిసెంబర్ 6
* యాదాద్రి పవర్ ప్లాంట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభం
* 244 విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన
డిసెంబర్ 7
* స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం
* పోలీస్ బ్యాండ్ ప్రదర్శన
* తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు
డిసెంబర్ 8
* 7 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రాజెక్టుల ప్రారంభం
* 130 కొత్త మీ సేవల ప్రారంభం
* ఏఐ సిటీకి భూమి పూజ
* స్పోర్ట్స్ యూనివర్శిటీకి శంకుస్థాపన.
* తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలు.
డిసెంబర్ 9
* లక్షలాది మంది మహిళలతో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ
* ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు
* డ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటు