31-03-2025 12:14:12 AM
నటి తమన్నా భాటియా కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల2’. దర్శకుడు అశోక్‌తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంపత్ నంది కథా రచయిత. ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచేసింది.
తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఓ ఇంటర్వ్యూలో చిత్రబృందం పాల్గొన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులలాంటి తమ జీవితాల్లోని అనుభవాలను ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. ‘నేను 2025లో వంట చేయడం కొంచెమైనా నేర్చుకుందామని అనుకున్నాను.
ఆ పని ఉగాది పచ్చడి తయారు చేయడంతో ఆరంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని తెలిపింది. తన గురించి ఇంకా చెప్తూ.. ‘నేను ప్రతి రోజూ ఆనందంగా ఉండేలా చూసుకుంటా. ఇంట్లోవాళ్లతో సరదాగా గడపే సమయం కోసం ఎదురుచూస్తా. స్నేహితులతో గడపడం ఇష్టం. పిల్లలతో ఆడుకోవడమంటే మహా సరదా. ఇవన్నీ నాకు చాలా ఆనందాన్నిస్తాయి. నాకు పులుపు అంటే ఇష్టం. తెలుగు వంటకాల్లో పలుపు ఎక్కువగా వాడతారు.
అందుకే ఇక్కడి వంటకాలను ఎక్కువగా ఇష్టపడతా. ఈ కొత్త ఏడాదిలో వదిలేయాలనుకునేంత చెడు నా జీవితంలో ఇప్పుడేమీ లేదు. ఇప్పుడెలా ఉన్నానో.. అలాగే ఉంటా’ అని తెలిపింది. “హ్యాపీడేస్’ నా కెరీర్‌ను మలుపు తిప్పే సినిమా అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. బాహుబలి సినిమా గ్లోబల్ స్థాయిలో వెళ్తుందని ఊహిం చలేదు. ఏదో ఓ విభిన్నమైన సినిమా తీస్తున్నాం. తెలుగు ప్రేక్షకుల వరకైతే కచ్చితంగా నచ్చుతుందని మాత్రమే అనుకున్నా.
నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే అందులోని పాటల కోసం ఒప్పుకున్నా. ‘ఓదెల2’ విషయంలో అలా కాదు. మొదట్నుంచే ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకున్నాను. నాగసాధు, శివశక్తి లాంటి క్యారెక్టర్స్ యాక్టర్‌గా నాకు బిగ్టెస్ట్ ఛాలెంజ్. ఇలాంటి పాత్రలు ధరించేటప్పుడు ఎవరైనా ఇది కేవలం కాస్ట్యూ మ్స్ మాత్రమే అనుకోవద్దు.
కాస్ట్యూమ్స్ కూడా రియల్‌గా ఉండేలా జాగ్రత్తపడ్డాం. ఈ క్యారెక్టర్‌కు ఎక్కడా రెఫరెన్స్ తీసుకోలేదు. ఓ సాధులాగా మారిపోయా. నా జీవితంలో దయ్యం అనుభవం లేదు. దయ్యాలను కలుసుకోవా లని కూడా నేను కోరుకోవటంలేదు. అయితే, ఒకటి మాత్రం నమ్మకంగా చెప్పగలను. పాజిటివ్ ఉందనేది ఎంతవరకు నిజమో.. నెగెటివ్ ఉందని కూడా నమ్ముతా. నేను గడ్స్‌ను నమ్ముకొని ముందుకెళ్తా. స్త్రీ శక్తి గొప్పతనాన్ని తెలియజేసే ఈ సినిమాతో నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది తమన్నా.