భారత హాకీ జట్టు బోణీ
పారిస్: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు విజయంతో ప్రయాణాన్ని మొదలుపెట్టింది. శనివారం పూల్‌రా భాగంగా భారత్ 3 న్యూజిలాండ్‌పై విజయాన్ని నమోదు చేసుకుంది. టీమిండియా తరఫున మణిదీప్ (ఆట 24వ నిమిషం), వివేక్ సాగర్ (34వ ని.లో), హర్మన్ ప్రీత్ (59వ ని.లో) గోల్స్ సాధించారు. న్యూజిలాండ్ తరఫున లేన్ సామ్ (8వ ని.లో), చిల్డ్ సిమోన్ (53వ ని.లో) గోల్స్ అందించారు. తొలి క్వార్టర్‌లో 0 వెనుకంజ వేసిన భారత్ ఆ తర్వాత దూకుడు పెంచింది. రెండో క్వార్టర్స్‌లో మరింత వేగంగా ఆడిన భారత్.. న్యూజిలాండ్‌పై గోల్ చేసి స్కోరును సమం చేసింది.
ఇక మూడో క్వార్టర్‌లో వివేక్ సాగర్ గోల్ కొట్టడంతో భారత్ 2 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకున్న న్యూజిలాండ్ 2 మరోసారి స్కోరు సమమైంది. దీంతో చివరి క్వార్టర్స్‌లో ఉత్కంఠ చోటుచేసుకుంది. గోల్ కోసం ఇరుజట్లు తీవ్రంగా యత్నించాయి. చివర్లో భారత్‌కు అందివచ్చిన పెనాల్టీ స్ట్రోక్ అవకాశాన్ని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఒడిసిపట్టి బంతిని గోల్ పోస్ట్‌లోకి తరలించడంతో భారత్ విజయం సాధించింది. ఈ నెల 29న అర్జెంటీనాతో భారత్ తలపడనుంది.