calender_icon.png 22 April, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోళ్లు వెంటనే ప్రారంభించండి

15-11-2024 12:00:00 AM

ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఒకవైపు మంత్రి పొంగులేటి హామీ ఇస్తుంటే, మరోవైపు వారం రోజులవుతున్నా కొనుగోళ్లు ప్రారంభం కావడం లేదంటూ రైతులు ఆందోళనలకు దిగే పరిస్థితి ఎదురు కావడం బాధాకరం. కామారెడ్డి జిల్లాలోని కల్లూరు గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపగా, రామాయంపేటలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టినట్టు వార్తలు వచ్చాయి. ఇంకోపక్క మరో మంత్రి పొన్నం కూడా ధాన్యం తరలింపులో సమస్యలు రాకుండా చూస్తున్నట్టు చెప్పారు. త్వరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలి.

- డి. సాయికుమార్, మేడ్చల్