ఫతేనగర్, ఖాజాగూడ ఎస్టీపీలను సందర్శించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (విజయక్రాంతి): నగరంలో పనులు ముగింపు దశలో ఉన్న ఫతేనగర్, ఖాజాకుంట ఎస్టీపీల(మురుగు శుద్ధి కేంద్రాలు)ను ప్రారంభాని కి సిద్ధం చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్టీపీ ప్రాజెక్టుల్లో భాగంగా నిర్మిస్తున్న 31 ఎస్టీపీలలోని ప్యాకేజీ 3లో నిర్మిస్తున్న ఫతేనగర్, ఖాజాకుంట ఎస్టీపీలను శనివారం ఆయన సందర్శించి ఇన్‌లెట్ పంపులను స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. ఆయా పరిసరాల్లో లైటింగ్, సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఎస్టీపీలను ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో పూల మొక్కలతో సుం దరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఈడీ డాక్టర్ ఎం సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ రఘు, సీజీ ఎం, జీఎం, ఎస్టీపీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభానికి సిద్ధంగా 6 ఎస్టీపీలు..
జలమండలి నిర్మిస్తున్న ఎస్టీపీ ప్రాజెక్టుల్లో ఇప్పటికే కోకాపేట, దుర్గంచెరువు, పెద్దచెరువు, నల్లచెరువు ఎస్టీపీలు ప్రారంభమ య్యాయి. మిరాలం, మియాపూర్, పటేల్ చెరువు, సఫిల్‌గూడ, వెన్నెల గడ్డ, నాగోల్ ఎస్టీపీలు ప్రారంభ దశలో ఉన్నాయి. వీటిని జూలైలో ప్రారంభించే అవకాశం ఉంది. ఆగస్టులో నల్లగండ్ల, ముల్లకత్వ చెరువు, శివాల య నగర్, పాలపిట్ట దగ్గర నిర్మిస్తున్న ఎస్టీపీలను ప్రారంభించనున్నారు.
వంద శాతం మురుగు శుద్ధి దిశగా..
మురుగు శుద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. అందుకోసం వంద శాతం శుద్ధి చేయడానికి వీలుగా ఎస్టీపీల ప్రాజెక్టుకు జలమండలి ఆధ్వర్యంలో శ్రీకా రం చుట్టింది. అయితే నగరంలో ప్రస్తుతం ఉత్పన్నం అవుతున్న 1950 ఎంఎల్‌డీల మురుగును వంద శాతం శుద్ధి చేసే దిశగా జలమండలి అడుగులు వేస్తోంది. ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్‌డీల (46 శాతం) మురుగును శుద్ధి చేస్తోంది. 3 ప్యాకేజీలుగా రూ.3866.41 కోట్ల వ్యయంతో మ రో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణం చేపట్టింది. 4 ఎస్టీపీలు ప్రారంభం కాగా, మరో 7 ఎస్టీపీ లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. డిసెంబర్ నాటికి అన్ని ఎస్టీపీలను పూర్తి చేయా లని జలమండలి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఫిర్యాదులకు ప్రాధాన్యం..
జలమండలి వినియోగదారుల ఫిర్యాదులకు ప్రాధాన్యమిచ్చి, సమస్యలకు సత్వ ర పరిష్కారం చూపాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కారాలయంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఎండీ కార్యక్ర మంలో ఆయన పాల్గొని.. ఫోన్ చేసిన 15 మంది వినియోగదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంబంధిత జనరల్ మేనేజర్లతో మాట్లాడి వినియోగదారుల సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు సీజీఎంలు, జీఎంలు పాల్గొన్నారు.