calender_icon.png 24 October, 2024 | 7:48 PM

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

24-10-2024 05:47:49 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, రాయపోల్ ఐకేపీ ఏపీఎం కిషన్ కిషన్ లు అన్నారు. గురువారం మండలంలోని గొల్లపల్లి, రామారం, రామ్ సాగర్, అంకిరెడ్డిపల్లి, వడ్డేపల్లి, ఎల్కల్ గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రానికి తరలించి తగిన గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.

కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐకెపి సిబ్బంది అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తారని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియం చేసుకోవాలని పేర్కొన్నారు. వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ఐకెపి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ధాన్యం వచ్చిన వెంటనే తేమశాతాన్ని పరిశీలించి వెంటనే తూకం వేయాలని సూచించారు. వానకాలం సీజన్లో రైతులు ఎక్కువ శాతం వరి సాగు చేశారని ధాన్యం కూడా అధిక శాతం వచ్చే అవకాశం ఉందని ఐకెపి సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  ఐకెపి  సీసీలు రాజేశ్వరరావు,ప్రవీణ్ కుమార్,కిష్టయ్య,రవీందర్,పంచాయతి కార్యదర్శి యాదగిరి.గ్రామ నాయకులు రాజగౌడ్.గుమ్మడి వెంకట్. చిరంజీవి, గ్రామ మహిళా సభ్యురాలు, తదితరులు పాల్గొన్నారు.