calender_icon.png 28 December, 2024 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ప్రారంభం

07-11-2024 11:22:12 AM

చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో ఉన్నటువంటి పలు గ్రామాలలో నేడు ఐకెపి సెంటర్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అధికారులు మాట్లాడుతూ.. రైతులు శ్రమించి తాము పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలని  తెలిపారు. ఏ గ్రేడ్ 2320, అని సాధారణం 2300 రూపాయలు ధర ఉన్నాయని తెలిపారు. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ కూడా ఉంటుందన్నారు.