calender_icon.png 2 November, 2024 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఐఎస్ సర్వే ప్రారంభం

31-07-2024 12:30:01 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపులు పారదర్శకంగా నిర్వహించేందుకు, జీహె చ్‌ఎంసీ ఆదాయం మరింత పెంచుకోవడానికి  చేపడుతున్న జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(జీఐఎస్) సర్వే మంగళవారం ప్రారంభమైంది. ఉప్ప ల్, హయత్‌నగర్, హైదర్‌నగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మియా పూర్, చందానగర్ ఏరియాల్లో ఈ ఫీల్డ్ సర్వేను నిర్వహించారు. ఇంటి యజమానులు సర్వే సిబ్బంది అడిగిన సమాచారాన్ని తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు. కాగా, క్షేత్ర స్థాయిలో సర్వే కోసం వచ్చే జీహెచ్‌ఎంసీ సిబ్బందికి భవన నిర్మాణ అను మతి, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఇటీవల చెల్లించిన ఆస్తి పన్ను రశీదు, నల్లా బిల్లు, విద్యుత్తు బిల్లు, యజమాని గుర్తింపు కార్డు వివరాలు, ట్రేడ్ లైసెన్స్ నంబర్(కమర్షియల్ భవనాలకు) తదితర వివరాలు అందించి సహకరించా లని అధికారులు కోరారు.