ఎన్‌హెచ్‌ఏ అధికారులతో చేవెళ్ల ఎంపీ కొండా భేటి
చేవెళ్ల, నవంబర్ 18: అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు పెండింగ్‌లో ఉన్న బీజాపూర్ హైవే పనులను వెంటనే ప్రారంభించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తన కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వర్ రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ ధర్మారెడ్డితో రోడ్డు పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు.
రోడ్డు పనుల్లో జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, కొండా రాందేవ్ రెడ్డి, రమణా రెడ్డి, టీఏసీ కమిటీ మెంబర్ మాణిక్య రెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.