పాపన్నపేట: మండల కేంద్రమైన పాపన్నపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో భాగంగా శనివారం స్నాక్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. పదో తరగతి చదివి విద్యార్థులకు గత కొంతకాలంగా ఉదయం సాయంత్రం పూట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే, కాగా ఫిబ్రవరి 1 నుండి మార్చ్ 20 వరకు విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మొదటి రోజు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో బెల్లం పట్టీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెడ్మాస్టర్ ప్రవీణ్, ఉపాధ్యాయులు యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి, నాగరాజు, సిఆర్పి సత్యనారాయణ రెడ్డి, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.