calender_icon.png 20 March, 2025 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మాణ పనులు ప్రారంభించండి

20-03-2025 01:11:22 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, మార్చి 19 (విజయక్రాంతి ) : ఇందిరమ్మ ఇండ్లకు ఎంపికైన లబ్ధిదారులందరూ  ఈ నెలాఖరులోపు ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యతో కలిసి తహసిల్దార్ లు, ఎంపీడీవోలు వెబ్‌ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో  ఎంపిక చేయబడిన 15 గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి  ఎంపికై మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు.

ఇంకా ఇంటి నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులందరికీ ఇళ్ల నిర్మాణం పై అవగాహన కల్పించాలన్నారు. ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని వారికి స్పష్టంగా తెలియజేయాలన్నారు. సమావేశంలో హౌసింగ్ అధికారులు విఠోబా, పర్వతాలు, వెబ్ ఎక్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.