calender_icon.png 26 December, 2024 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి

05-11-2024 01:14:35 AM

తహసీల్దార్‌కు బీజేపీ నేతల వినతి

మానకొండూర్, నవంబర్ 4: కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్, మానకొండూర్‌లలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు కోరా రు. ఈ మేరకు సోమవారం తిమ్మాపూర్, మానకొండూర్ మండల తహసీల్దార్లకు బీజే పీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరికోతలు మొదలై నెలరోజులవుతున్నా ఇంకా కేంద్రాలవారిగా రైస్ మిల్లులను అలాట్ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు.

కొనుగోలు కేంద్రాలను వెం టనే ప్రారంభించి.. అక్కడ వసతులను కల్పించాలని బీజేపీ నేతలు.. సుగుర్తి జగదీశ్వరా చారి, రాపాక ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బూట్ల శ్రీనివాస్, తిరుపతి రాజు, బీజేవైఎం నేత గడ్డం అరుణ్, కిసాన్ మోర్చా మండల కార్యదర్శి కాసుగంటి మధుకర్ రెడ్డి, దేవ వినోద్ రెడ్డి, ముంజం రమేశ్ పాల్గొన్నారు.