11-12-2024 01:23:21 AM
కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ కడియం కావ్య
జనగామ, డిసెంబర్ 10 (విజయక్రాంతి): వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టు పనులు త్వరగా ప్రారంభించేలా చొరవ చూ పాలని ఎంపీ కడియం కావ్య కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయు డును కోరారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మంత్రిని కలిశారు. మామునూరు ఎయిర్‌పోర్టును రెండేళ్లలో పూర్తి చేసి విమానాల రాకపోకలను ప్రారంభించాలని కోరారు.
మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ లో భాగంగా భూసేకరణ కోసం రూ.205 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఆమె చెప్పారు. త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తానని మంత్రి రామ్మోహన్‌నాయు డు హామీ ఇచ్చినట్లు ఎంపీ కావ్య తెలిపారు.