calender_icon.png 14 October, 2024 | 5:57 AM

స్టార్‌షిప్ ప్రయోగం సక్సెస్

14-10-2024 03:45:07 AM

  1. లాంచ్‌ప్యాడ్‌పైకే తిరిగి చేరుకున్న బూస్టర్
  2. హిందూ మహాసముద్రంలో దిగిన స్పేస్‌క్రాఫ్ట్

వాషింగ్టన్, అక్టోబర్ 13: ఎలాన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక స్టార్‌షిప్ 5వ ప్రయోగం విజయవంత మైంది. ఆదివారం ఉదయం టెక్సాస్ దక్షిమ తీరం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది. బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్ దశలతో ఈ భారీ రాకెట్‌లోని బూస్టర్ మొదటగా దాన్ని ప్రయోగించిన లాంచ్‌ప్యాడ్ వద్దకే తిరిగి చేరుకుంది.

అక్కడ ఉన్న చాప్‌స్టిక్‌లు దాన్ని ఒడిసిపట్టాయి. ఇది ఇంజినీరింగ్ అద్భుతమని శాస్త్రవేత్తలు ప్రశంసించారు. తన ప్రయాణాన్ని కొనసాగించిన స్పేస్‌క్రాఫ్ట్ అనంతరం హిందూ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది. దీనికి సంబంధించిన వీడియోను మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్‌ఎక్స్ సంస్థలో సందడి వాతావరణం నెలకొంది.