calender_icon.png 1 October, 2024 | 9:18 PM

ఐఫా వేడుకల్లో తారల సందడి

29-09-2024 01:34:38 AM

సినీరంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) పురస్కారాల వేడుకలతో యూఏఈలోని అబుదాబిలో సందడి నెలకొంది. శుక్రవారం ప్రారంభమైన ఈ ఐఫా వేడుకలకు అక్కడి యాస్ ఐలాండ్ ఎతిహాద్ అరేనా వేదికైంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నటీనటులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేదికపై మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది.

ఆయన ‘ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇండియన్ సినిమా’ అవార్డును అందుకున్నారు. ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ సమంతను వరించింది. ఈ వేడుకలో టాలీవుడ్ సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేశ్‌తోపాటు ఐశ్వర్యరాయ్, ప్రియమణి, మణిరత్నం, టోవినో థామస్ తదితరులు పాల్గొన్నారు. 

ఎవరికి ఏ అవార్డు? 

ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా: చిరంజీవి 

ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా: ప్రియదర్శన్ 

ఉమెన్ ఆఫ్ ది ఇయర్: సమంత 

గోల్డెన్ లెగసీ: బాలకృష్ణ 

ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ (కన్నడ): రిషబ్ శెట్టి 

ఉత్తమ చిత్రం (తమిళం): జైలర్ 

ఉత్తమ చిత్రం (తెలుగు): దసరా 

ఉత్తమ నటుడు (తమిళం): విక్రమ్ (పొన్నియన్ సెల్వన్ 2)

ఉత్తమ నటి (తమిళం): ఐశ్వర్యరాజ్ (పొన్నియన్ సెల్వన్ 2)

ఉత్తమ దర్శకుడు (తమిళం): మణిరత్నం (పొన్నియన్ సెల్వన్ 2)

ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం): ఏఆర్ రెహమాన్ (పొన్నియన్ సెల్వన్ 2)

ఉత్తమ విలన్ (తమిళం): ఎస్‌జే సూర్య (మార్క్ ఆంటోనీ)

ఉత్తమ విలన్ (తెలుగు): షైన్ టామ్ (దసరా) 

ఉత్తమ విలన్ (కన్నడ): జగపతిబాబు 

ఉత్తమ విలన్ (మలయాళం): అర్జున్ రాధాకృష్ణన్ 

ఉత్తమ సహాయ నటుడు (తమిళం): జయరామ్ (పొన్నియన్ సెల్వన్ 2)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి 

ఉత్తమ సాహిత్యం: జైలర్ (హుకుం) 

ఉత్తమ నేపథ్య గాయకుడు: చిన్నంజిరు (పొన్నియన్ సెల్వన్ 2) 

ఉత్తమ నేపథ్య గాయని: శక్తిశ్రీ గోపాలన్ (పొన్నియన్ సెల్వన్ 2)