* ఇద్దరు నిందితుల అరెస్టు
మేడిపల్లి, డిసెంబర్ 25: అరుదైన నక్షత్ర తాబేళ్ల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను ఉప్పల్ ఎఫ్‌ఆర్‌వో అధికారులతో కలిసి మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలోని ఆదర్శ్‌నగర్‌లోని ఓ అక్వేరి యం షాప్‌లో తాబేళ్ల విక్రయాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు.. షేక్ జానీ(50), ఎండీ సిరాజ్ అహ్మద్ (39)ను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి 281 నక్షత్ర తాబేళ్లు, 160 ఎర్రచెవుల స్లయిడర్ తాబేళ్లు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్లో రూ. 64లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. వన్యమృగ చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
తాబేళ్లను అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఎస్వోటీ డీసీపీ రమణా రెడ్డి, అదనపు డీసీపీ నర్సింహా రెడ్డి, ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, మల్కాజిగిరి జోన్ ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి ఎస్వోటీ ఎస్సై వాసుదేవ్ ఈ ఆపరేష న్‌లో పాల్గొన్నారు.