calender_icon.png 4 October, 2024 | 2:57 PM

స్టార్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ

04-10-2024 12:00:00 AM

కరీంనగర్ సిటీ, అక్టోబర్ 3: కరీంనగర్ పట్టణంలోని సరస్వతినగర్‌లో గల స్టార్ కిడ్స్ పాఠశాలలో గురువారం బతుకమ్మ, దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ వస్త్రాదారణలో హాజరై బతుకమ్మ, కోలాటం ఆడుతూ, నృత్యాలు చేశారు. పాఠశాల చైర్మన్ రాజకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ మహిళలకు ముఖ్యమైన పండుగా బతుకమ్మ అని అన్నారు. ఈ పండుగను మహిళలు ఎంతో సంబురంగా జరుపుకొంటారని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ లీనా ప్రియదర్శిని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు  బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.