19-04-2025 12:15:03 AM
వరల్డ్ లివర్ డే సందర్భంగా ప్రారంభం
హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిగా పేరు పొందిన నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్స్ శుక్రవారం వరల్డ్ లివర్ డే సందర్భంగా స్టార్ లివర్ ఇనిస్టిట్యూట్ అధ్వర్యంలో ‘లివర్ హెల్త్ ఇనిషియేటివ్’ను ప్రారంభించింది. నాలుగు ప్రత్యేక లివర్ క్లినిక్‌లను ప్రారంభించారు.
ఇవి కాలేయ సంబంధిత వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, నివారించి, నిపుణుల ద్వారా చికిత్స అందిస్తారు. ముఖ్యంగా నాన్-అల్కహాలిక్ ఫ్యాటి లివర్ డిసీజ్, వైరల్ హెపటైటిస్ వంటి సమస్యలపై దృష్టి పెట్టనున్నారు. స్టార్ హాస్పిటల్స్ లివర్ సంబంధిత అన్ని రకాల వ్యాధుల కోసం సమగ్ర సేవలు అందిస్తున్న కేంద్రంగా ఉన్నది.
చిన్న స్క్రీనింగ్‌ల నుంచి క్లిష్టమైన లివర్ ట్రాన్స్‌ప్లాంట్ వరకు అనేక చికిత్సలను అందించగల సామర్థ్యం ఉంది. నూతనంగా ప్రారంభించిన నాలుగు క్లినిక్‌లలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం సెకండ్ ఓపీనియన్ క్లినిక్, ఫ్యాటి లివర్ క్లినిక్, వైరల్ హెపటైటిస్ మేనేజ్మెంట్ క్లినిక్, హెపటైటిస్ బీ, సీపరీక్షలు, చికిత్స, ప్రివెంటివ్ హెపటాలజీ క్లినిక్ ఉన్నాయి.
డా. జి. శ్రీనివాస్, సీనియర్ హెపటాలజిస్ట్ మాట్లాడుతూ.. ఎన్‌ఏఎఫ్‌ఎల్ మొదటి దశలో నిశ్శబ్దంగా ఉంటుందని, జీవనశైలి మార్పులతో పూర్తిగా నివారించవచ్చన్నారు.