09-04-2025 11:19:21 PM
స్టార్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజాచిత్రం ‘నారి నారి నడుమ మురారి’. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలుగా నటించారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్‌లుక్, ఇతర పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ సినిమా ఫస్ట్ సింగిల్ ‘దర్శనమే..’ రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ‘దర్శనమే.. మధుర క్షణమే.. నీవు నేనూ ఇక మనమే.. మనసున మోగే మంగళ నాదస్వరమే.. నీతో పరిచయమే ప్రియవరం.. ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు..’ అంటూ సాగుతున్న ఈ పాటను సంగీత దర్శకుడు విశాల్‌చంద్రశేఖర్ ఓ క్లాసిక్ మెలోడీగా కంపోజ్ చేశారు. మనసును కట్టిపడేసే ఈ గీతానికి రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా, యాజిన్ నిజార్ ఆలపించారు. ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ వీఎస్, యువరాజ్ సినిమాటోగ్రఫీ నిర్వర్తిస్తున్నారు. భాను భోగవరపు కథను అందించగా, నందు సావిరిగణ సంభాషణలు రాశారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర సహ నిర్మాత కాగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.