16-03-2025 06:53:12 PM
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్ మరో ఆరు రోజుల్లో ప్రారంభం అవ్వనుంది. కాగా, ఇప్పటికే ఆటగాళ్లందరూ తమ జట్టుతో కలిసి ప్రాక్టీస్ లో మునిగిపోయారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఆర్సీబీ క్యాంప్ లో చేరాడు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ ఓ భారీ రికార్డును సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. అతను ఈ ఐపీఎల్ సీజన్లో ఒక్క సెంచరీ సాధిస్తే టీ20 క్రికెట్లో పది శతకాలు పూర్తి చేసుకుంటాడు.
ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్ లో ఇన్ని సెంచరీలు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా... హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (8) రెండవ స్థానంలో ఉన్నాడు. విరాట్ ఇప్పటి వరకు 399 మ్యాచ్‌లు ఆడి 9 సెంచరీలు బాదాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు ఐపీఎల్లో కాగా.. ఒకటి అంతర్జాతీయ క్రికెట్లో సాధించాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో అధిక శతకాలు చేసింది కోహ్లినే. 2016 ఐపీఎల్లో విరాట్ కోహ్లీ ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు.
టీ20ల్లో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీళ్లే...
క్రిస్ గేల్ (వెస్టిండీస్, 463 మ్యాచ్లు)- 22
బాబర్ అజామ్ (పాకిస్థాన్, 309 మ్యాచ్లు)- 11
విరాట్ కోహ్లీ (భారత్, 399 మ్యాచ్లు)- 9
మైకేల్ క్లింగర్ (ఆస్ట్రేలియా, 206 మ్యాచ్లు )- 9
రిలీ రోసోవ్ (సౌతాఫ్రికా, 367 మ్యాచ్లు)- 8
ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా, 387 మ్యాచ్లు )- 8
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా, 399 మ్యాచ్లు)- 8
జోస్ బట్లర్ (ఇంగ్లాండ్, 434 మ్యాచ్లు)- 8
రోహిత్ శర్మ (భారత్, 448 మ్యాచ్లు)- 8