హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8(విజయక్రాంతి): వైద్యరంగంలో 16 ఏండ్లుగా సేవలందిస్తున్న స్టార్ హాస్పటల్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో స్టార్ కాంప్రెహెన్సివ్ స్ట్రోక్ కేర్‌సెంటర్‌ను ప్రారంభించినట్లు ఆ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో జంట నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాలు సమీప నగరాలకు చెందిన ప్రజలకు పక్షవాతానికి అధనాతన చికిత్స అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు.
పక్షవాతం కారణంగా సరైన సమయానికి వైద్యం అందక దేశంలో లక్షలాదిగా చనిపోతున్నారన్నారు. అందుకే తమ ఆస్పత్రిలో స్టార్ కాంప్రెహెన్సివ్ స్ట్రోక్ కేర్‌సెంటర్‌కు రూపొందించామన్నారు.ఈ ఆస్పత్రికి చెందిన న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్‌లు, ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్టులు, ఎమర్జెన్సీ ఫిజీషియన్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.