స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘కృష్ణ అండ్ హిస్ లీల’. 2020లో కరోనా సమయంలో ఓటీటీలో నేరుగా విడుదలైన ఈ సినిమా విజయాన్నందుకుంది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్‌స్టొరీపై ఒక రిఫ్రెషింగ్ టేక్, ఇందులో శ్రద్ధాశ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. డిజిటల్‌లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి వస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను ప్రస్తుతం ‘ఇట్స్ కాంప్లికేటెడ్’గా మార్చారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమాకు షానియల్ డియో, సాయిప్రకాశ్ ఉమ్మడిసింగు డీవోపీగా పనిచేశారు.