calender_icon.png 8 April, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డైరెక్షన్ ఇప్పుడే వద్దు.. నటుడిగానే ఉండనీ..!

07-04-2025 12:00:00 AM

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం ‘జాక్ కొంచెం క్రాక్’. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నేతత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందు లో సిద్దు సరసన వైష్ణవిచైతన్య హీరోయిన్‌గా నటించారు. ఏ ప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ చిత్రం. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు  పెంచేశాయి. తాజాగా మూవీయూనిట్ భీమవరంలో ప్రమోషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా కథానాయకుడు సిద్దు మాట్లాడుతూ.. ‘కాలేజ్ లైఫ్ ఎంతో అందంగా ఉంటుంది. ఈ టైమ్ మళ్లీ రాదు. ఎంజాయ్ చేయండి. ఏప్రిల్ 10న జాక్ చిత్రం రాబోతోంది.

అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని తెలిపారు. కథానాయకి వైష్ణవి మాట్లాడుతూ.. ‘నాకు కాలేజ్ లైఫ్ అంటే చాలా ఇష్టం. మీ అందరిలా ఇలా ఈవెంట్లు, ఫెస్ట్‌లో వచ్చి ఎంజాయ్ చేయాలని ఉండేది. జాక్ చిత్రం చాలా ఫన్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఇందులో సిద్దుతో నటించడం ఎంతో గొప్ప అనుభూతినిచ్చింది. ఆయన చాలా ప్రతిభ ఉన్న వ్యక్తి. జాక్ టీమ్‌తో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అని చెప్పారు. నిర్మాత ప్రసాద్ మాట్లాడుతూ.. ‘సిద్దు జొన్నలగడ్డ ఆల్ రౌండర్. ఇప్పుడు ఇక్కడి విద్యార్థులు డైరెక్షన్ చేయమని కోరుతున్నారు. ఇంకొన్ని రోజులు ఇలా సినిమాలు తీయనివ్వండి’ అన్నారు.