మియామి బీచ్: అమెరికా స్టా ర్ అథ్లెట్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత ఫ్రెడ్ కెర్లే అరెస్టయ్యాడు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఫ్రెడ్ కెర్లే పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియోలు బయటికి వచ్చాయి.
వీడియోలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం కనిపించింది. పార్కింగ్ విష యమై ఫ్రెడ్ కెర్లే పోలీసులతో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. వీడి యో ఫుటేజ్ ఆధారంగా కెర్లేను శనివారం అదుపులోకి తీసుకున్నారు. 2020 టోక్యో ఒలింపి క్స్‌లో 100 మీటర్ల ఈవెంట్‌లో రజతం నెగ్గిన ఫ్రెడ్ కెర్లే 2024 పారిస్ విశ్వక్రీడల్లో కాంస్యం సాధించాడు. .