calender_icon.png 22 February, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీలో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం

22-02-2025 12:04:21 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలక మండలి ఆఖరి ఏడాదిలో అత్యంత ఉత్కంఠ రేపిన స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఎట్టకేలకు ఏకగ్రీవమైంది. బల్దియాలో 15 మంది సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీ ఎన్నిక కోసం మొత్తం 17 మంది నామినేషన్లు వచ్చాయి.

వీరిలో ఇద్దరు బీఆర్‌ఎస్‌కు చెందిన కూకట్‌పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మీ లింగాని తమ నామినేషన్లను శుక్రవారం విత్ డ్రా చేసుకున్నారు. దీంతో బరిలో 15 మంది మాత్రమే మిగిలిఉండటంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రకటించారు.

ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారిలో ఎంఐఎంకు చెందిన బాతా జబీన్, సయ్యద్ మిన్హా  అబ్దుల్ వాహబ్, మహ్మద్ సలీమ్, పరవీన్ సుల్తానా, సమీనా బేగం, డాక్టర్ అయేషా హుమేరా, గౌసుద్దీన్ మహ్మద్, కాంగ్రెస్ పార్టీకి చెందిన వీ జగదీశ్వర్‌గౌడ్, బానోతు సుజాత, ఎండీ బాబా ఫసీయొద్దీన్, బూరుగడ్డ పుష్ప, బొంతు శ్రీదేవి, మహాలక్ష్మీ రామన్‌గౌడ్, సీఎన్ రెడ్డి ఉన్నారు.