calender_icon.png 29 December, 2024 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రి త్యాగానికి ప్రతీకగా నిలిచి..

29-12-2024 12:37:18 AM

మెల్‌బోర్న్ టెస్టులో నితీశ్ కుమార్ సెంచరీ చేయగానే స్టాండ్స్‌లో ఉన్న తండ్రి ముత్యాలరెడ్డి కుమారుడు సాధించిన ఘనతను చూస్తూ మురిసిపోయాడు. ఆ క్షణంలో అతడి కళ్ల వెంబడి ఆనందభాష్పాలు ఉప్పొంగి వచ్చాయి. కొడుకు భవిష్యత్ కోసం తన కెరీర్‌ను పణంగా పెట్టడమే ఆ కన్నీటీకి నిలువెత్తు సమాధానం. విశాఖపట్నంకు చెందిన నితీశ్ రెడ్డి చిన్నప్పటి నుంచే క్రికెటర్ కావాలని కలలు కన్నాడు.

ముత్యాల రెడ్డి ప్రభుత్వ కంపెనీ హిందుస్థాన్ జింక్‌లో ఉద్యోగి. ఒక సందర్భంలో ముత్యాలరెడ్డి ఉద్యోగం పేరిట ఉదయ్‌పూర్‌కు బదిలీ అయ్యాడు. కానీ అక్కడ క్రికెట్‌కు సంబంధించిన సదుపాయాలు సరిగ్గా లేవన్న కారణంగా కొడుకు భవిష్యత్తు కోసం ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ప్రారంభించినప్పటికీ అందులోనూ నష్టాలే.

దీంతో నితీశ్ రెడ్డి కుటుంబం ఆర్థికంగా మరింత కుంగిపోయింది. అయినా తండ్రి ముత్యాలరెడ్డి అధైర్యపడలేదు. ఎన్ని కష్టాలొచ్చినా కుమారుడు గొప్ప క్రికెటర్‌గా ఎదగాలని కలలు కన్నాడు. ఆ కల ఇవాళ మెల్‌బోర్న్ టెస్టుతో నిజమైంది. అలా తండ్రి త్యాగానికి ప్రతీకగా మారాడు నితీశ్ కుమార్ రెడ్డి. కాగా నితీశ్ తండ్రి ముత్యాలరెడ్డి కోహ్లీ భార్య అనుష్క శర్మతో దిగిన ఫోటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు.