calender_icon.png 15 November, 2024 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానకొండూర్ మార్కెట్ కమిటీ ప్రమాణం

31-08-2024 02:59:14 AM

హాజరైన ఎమ్మెల్యే కవ్వంపల్లి  

కరీంనగర్, ఆగస్టు 30 (విజయక్రాంతి): మానకొండూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం నిర్వహించారు. చైర్మన్‌గా మర్రి ఓదెలు, వైస్ చైర్మన్‌గా రామిడి తిరుమల్‌రెడ్డితోపాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు సంక్షేమం కోరుకునే పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేశారని అన్నారు.

మానకొండూర్ మండలంలో దాదాపు 8 వేల మంది రైతులకు ఇప్పటివరకు రూ.55 కోట్ల రుణమాఫీ జరిగిందని తెలిపారు. పలు సాంకేతిక కారణాల వల్ల ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని, ఈ మండలంలోని రుణమాఫీ కానీ రైతులను అధికారులు గుర్తిస్తున్నారని, త్వరలోనే వారికి కూడా రుణమాఫీ చేస్తామని తెలిపారు. నూతన చైర్మన్ మర్రి ఓదెలు, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. మానకొండూర్ మార్కెట్ అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు.