calender_icon.png 15 January, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

26 శాతం ప్రీమియంతో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ లిస్టింగ్

14-01-2025 12:33:24 AM

ముంబై:  స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ  సంస్థ ఐపీఓ జారీ ధరతో పోలిస్తే దాదాపు 26 శాతం ప్రీమియంతో దేశీయ స్టాక్ మా ర్కెట్లలో లిస్టయింది. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ సంస్థ ఐపీఓలో షేర్ జారీ ధర రూ.140 కాగా, ఇష్యూ ప్రైస్‌పై 25.71 శాతం ప్రీమియంతో రూ.176లకు బీఎస్‌ఈలో లిస్టయింది. తదుపరి 29.78 శాతం వృద్ధితో రూ.181.70 లకు పుంజుకుంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈలో 22.85శాతం వృద్ధి చెంది రూ.172లకు చేరుకుంది.

తద్వారా సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,541.97 కోట్లకు చేరుకుంది. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ సంస్థ ఐపీఓలో 182.57రెట్లు సబ్ స్క్రిప్షన్ అయింది. రూ.133-140 షేర్ ధరపై సంస్థ రూ.410.05 కోట్ల నిధుల సేకరణకు ఐపీఓకు వెళ్లింది. తాజా షేర్ల జారీ ద్వారా రూ.210 కోట్లు, ప్రమోటర్ల వాటాలను ఆఫ ర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా విక్రయిస్తామని సెబీకీ సమర్పించిన రెడ్ హెర్రింగ్ ప్రా స్పెక్టస్ (ఆర్‌హెచ్‌పీ)లో ఇంతకు ముందే స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ తెలిపింది.