బీజేపీ కార్యకర్తలకు జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై బీజేపీ జాతీయ అధ్యక్షులు,ై కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు జి. కిషన్ రెడ్డికి ఫోన్ చేసి రాష్ర్టంలోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు పలువురు మృతిచెందడం, ప్రజల ఆస్తులు ధ్వంసంకావడంపై విచారం వ్యక్తం చేశారు. రాష్ర్ట ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని జి. కిషన్ రెడ్డికి సూచించారు.
ముఖ్యం గా ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, తాగునీరు అందించాలని తెలిపారు. సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ర్ట నాయకత్వానికి, కార్యక ర్తలకు ఆదేశాలు జారీ చేయాలని కిషన్ రెడ్డికి సలహా ఇచ్చారు. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహకరిస్తామని, ఇప్పటికే ఉన్న ఎన్డీ ఆర్‌ఎఫ్ బృందాలకు తోడుగా అదనంగా మరిన్ని బలగాలు పంపిస్తామన్నారు.