calender_icon.png 16 January, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటాం: మున్సిపల్ చైర్మన్

06-07-2024 02:55:04 PM

మంథని,(విజయక్రాంతి): నిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు పట్టణ ప్రజల అవసరాలను తమ బాధ్యతగా నిర్వర్తించే మున్సిపల్ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మున్సిపల్ చైర్మన్ రమా సురేష్ రెడ్డి తెలిపారు. శనివారం రోజు ఉదయం మున్సిపల్ కార్మికులకు నిత్యవసర వస్తువులైనటువంటి సబ్బులు, నూనె, శానిటైజర్లు, బ్లౌజులు, యూనిఫామ్ లను మున్సిపల్ సిబ్బందికి అందించారు. సందర్భంగా రమా సురేష్ రెడ్డి మాట్లాడుతూ... పట్టణాన్ని సుందరీకరించడంలో భాగంగా తమ జీవితాలను పణంగా పెట్టి మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నారని వారిని గౌరవించుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.

ఏ ప్రాంతంలోనైనా మున్సిపల్ సిబ్బంది లేకపోతే ఆ ప్రాంతం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు. మున్సిపల్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే రాష్ట్ర మంత్రి  శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లామని వారి సహాయ సహకారాలతో మున్సిపల్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను సైతం పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి స్థానిక కౌన్సిలర్లు కుర్ర లింగయ్య, వీకే రవి,నక్క నాగేంద్ర, గుండా విజయలక్ష్మి, వేముల లక్ష్మి, కొట్టే పద్మ లతోపాటు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.