calender_icon.png 5 December, 2024 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట

05-12-2024 12:57:31 AM

బాలుడి పరిస్థితి విషమం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కు పుష్ప ప్రీమియర్ షోకు బుధవారం రాత్రి భారీగా అభిమానులు తరలివచ్చారు. దీంతో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. దీంతో ఓ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన పోలీసులు బాలుడికి సీపీఆర్ చేసి, ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు థియేటర్ వద్ద  తొక్కిసలాటను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.