03-04-2025 12:02:39 AM
చెన్నై: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై మెమోను సమర్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సమయం కోరారు. ఈ మేరకు గత నెల 27న ఆయన మోదీకి ఒక లేఖ రాశారు. ఈ లేఖను స్టాలిన్ బుధవారం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందనున్న విషయమై చర్చించేందుకు వివిధ పార్టీల నేతలతో ఇటీవల స్టాలిన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. డీలిమిటేషన్‌పై పలు తీర్మానాలు చేశారు. ఈ కీలకం అంశంపై వినతిపత్రం సమర్పించేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన 2026లో జరగనుంది. ఇందుకు అనుసరించే విధివిధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళన రేగుతోంది. ఇటీవల డీఎంకే ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.