calender_icon.png 21 November, 2024 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రంపై స్టాలిన్ ఫైర్

21-11-2024 01:33:06 AM

హిందీ, మణిపూర్, కులగణన అంశాల్లో విమర్శలు

న్యూఢిల్లీ, నవంబర్ 20: కేంద్ర ప్రభుత్వం విధానాలు, చర్యలను ఖండిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన డీఎంకే అత్యున్నత స్థాయి కార్యనిర్వాహక కమిటీ బుధవారం ఆరు తీర్మానాలను ఆమోదించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషల కంటే హిందీని ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. కుల గణనను నిర్వహించడంలో విఫలమడం తోపాటు ఒకే దేశం ఎన్నికల కోసం ఒత్తిడి చేస్తోందని విమర్శించింది. వక్ఫ్ బోర్డులో సవరణల ద్వారా రాష్ట్ర అధికారాలను తగ్గించిందని ఆరోపించింది. రైల్వే ప్రమాదాలు, నిరుద్యోగంపై కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది.