calender_icon.png 13 April, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయంతో ఏర్పడ్డ అవినీతి కూటమి

13-04-2025 01:34:13 AM

బీజేపీ పొత్తుపై స్టాలిన్ విమర్శలు

చెన్నై, ఏప్రిల్ 12: తమిళనాడులో కుదిరిన బీజేపీ పొత్తు పై సీఎం స్టాలిన్ స్పందించారు. ఓడిపోయేందుకే ఏర్పడ్డ అవినీతి కూట మి అని బీజేపీ పొత్తు ని అభివర్ణించారు. ‘కేవలం రెండు దాడులకు భయపడి ఏఐఏడీఎంకేను తాకట్టు పెట్టిన వారు.. ఇప్పుడు తమిళనాడును తాకట్టుపెట్టేందుకు సిద్ధం అయ్యారు’ అని ఆరోపించారు. ఏఐఏడీఎంకే బీజేపీ చేతిలో బానిసగా మారిందన్నారు.

సీఎం మాట్లాడుతూ ‘రెండు పార్టీల సిద్ధాంతాల్లో క్లారిటీయే లేదు. భయంతోనే పొత్తు పెట్టుకున్నారు. నీట్ అంశాన్ని, హిందీ రుద్దే అంశాన్ని, వక్ఫ్ బిల్లు ను, డీలిమిటేషన్‌ను కూడా ఏఐఏడీఎంకే వ్యతిరేకించింది. అయినా బీజే పీ ఎలా పొత్తు పెట్టుకుంది. పొత్తు కోసమని ప్రెస్ మీట్ పెట్టి డీఎంకేపై వ్యక్తిగతంగా నాపై విమర్శలు గుప్పించారు.అధికారం కోసమే ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి’ అని విమర్శల వర్షం కురిపించారు.