హుజూరాబాద్, మే 17: హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన రంగస్థల నటుడు, సీనియర్ కళాకారుడు పోరెడ్డి శ్రీనివాసరెడ్డి (68) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. పెద్దపాపయ్యపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా శివరామకృష్ణ భజన మండలి స్థాపించి ఎంతోమంది కళాకారులను తయారు చేశారు. అలాగే హైదరాబాద్ నటరాజ కళాకారుల సంక్షేమ సంఘం స్థాపించారు. శ్రీనివాస్‌రెడ్డి సాంఘిక, పౌరాణిక రంగస్థల కళాకారునిగా రాష్ట్రస్థాయిలో ప్రసిద్ధి పొందారు. అక్షర ఉజ్వల, అక్షరాస్యత నిర్మూలన, మూఢనమ్మకాల నిర్మూలన తదితర సామాజిక కార్యక్రమాల కోసం ఎన్నో రకాల నాటకాలు ప్రదర్శించారు. శ్రీనివాస్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.