calender_icon.png 18 April, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్‌ ప్రమాదాలపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

10-04-2025 08:53:17 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): విద్యుత్‌ ప్రమాదాల పట్ల సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డివిజనల్ ఇంజనీర్ కైసర్ అన్నారు. గురువారం పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో సిబ్బందికి విద్యుత్‌ ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డివిజనల్ ఇంజనీర్ కైసర్ మాట్లాడుతూ.. విద్యుత్తు ప్రమాదాలు తలెత్తకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, టెక్నీకల్ ఇంజనీర్ సుబ్బలక్మి, క్యాతన్ పల్లి, హజీపూర్, నస్పూర్ ఏఇలు మహేందర్ రెడ్డి, ప్రభాకర్, రామచందర్, సబ్ ఇంజనీర్లు రవి, సుదేస్న, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.